Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం ఫారెస్ట్ ఆఫీస్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్ లోడ్ తో వస్తున్న ఇసుక లారీ అదుపుతప్పి పస్రా నుండి తాడ్వాయి కి వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పస్రా గ్రామానికి చెందిన పాషా(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరు లక్ష్మిపురం గ్రామానికి చెందిన నరేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ కావడంతో ఇసుక లారీల తో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్ జాం ఏర్పడింది. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర రావు ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.