Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కారు లోయలో పడడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జలింగ్ జిల్లాలో జరిగింది. ఎనిమిది మంది కారులో సిలిగురి నుంచి డార్జలింగ్ వెళ్తుండగా కుర్సియాంగ్ పరిధిలోని జాతీయ రహదారిపై లోయలోకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను డార్జలింగ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.