Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. అందులో భాగంగా శంషాబాద్ నుంచి కాలేజీ విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. వారితో ముచ్చటిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ యాత్రలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అందరూ నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ ఆవు యాత్రలోకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన నేతలు.. చెల్లాచెదురుగా అయ్యారు. కాసేపు ఆందోళన నెలకొంది. దీంతో అందరు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో యాత్ర మళ్లీ సజావుగా సాగింది.