Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. ఫలితంగా గాలి నాణ్యత సూచీ రోజు రోజుకు క్షీణిస్తున్నది. మంగళవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 385గా నమోదైంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని నోయిడాలో 444, ధీర్‌పూర్‌లో 594, గురుగ్రామ్‌లో 391, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 385 నమోదైంది. మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 15.2 డిగ్రీలుగా నమోదైంది. ఇది సీజన్ సగటు కంటే తక్కువ. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 15.1 డిగ్రీలుగా నమోదైంది. సోమవారం ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచీ సోమవారం రాత్రి 8 గంటలకు 361గా నమోదైంది. 0-50 మధ్య మెరుగైన, 51-100 మధ్య సంతృప్తికరం, 101-200 మధ్య మితమైంది, 200-300 పూర్, 301-400, 400-5001 మధ్య తీవ్రమైన కాలుష్యంగా పేర్కొంటారు. కాలుష్యం కారణంగా జనం ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్యానికి తోడు ఉదయం వేళలో మంచుకూడా తోడవడంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులుపడుతున్నారు.