Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ నరేలా ప్రాంతంలోని ఓ ఫుట్‌వేర్స్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం 20 మంది ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫ్యాక్టరీలోని మూడో అంతస్థులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది పలువురు కార్మికులను రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.