Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ప్రచారానికి సాయంత్రానికి తెరపడనుంది. దీంతో బై పోల్ ప్రచారానికి అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. మునుగోడుకు వచ్చి వెళ్లే వాహనాలను పోలీసులు అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడులో మహిళా గర్జన సభకు వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కారును తనిఖీ చేశారు. నారాయణపురం చెక్ పోస్టు వద్ద ఆయన కారులో సోదాలు నిర్వహించారు. అందులో ఏమీ దొరకకపోవడంతో అక్కడి నుంచి పంపేశారు.