Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని సతారా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని భార్య, తల్లిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బదౌన్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. సోమవారంనాడు ఈ ట్రిపుల్ మర్డర్ చోటుచేసుకుంది. మృతులను సమాజ్‌వాద్ పార్టీ మాజీ బ్లాక్ చీఫ్ రాకేష్ గుప్తా (58), అని భార్య శారదా దేవి (54), తల్లి శాంతి దేవి (80)గా గుర్తించారు. రాజకీయ శత్రుత్వమే ఈ హత్యలకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, మూడు హత్యల ఘటనపై తమకు సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమాచారం అందినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) ఓపీ సింగ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి గుప్తా ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి చొరబడినట్టు చెప్పారు. గుప్తాపైన, ఆయన కుటుంబ సభ్యుల పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారైనట్టు చెప్పారు. కాగా, గుప్తా, ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరిని అగంతకులు కాల్చిచంపిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను సమాజ్‌వాదీ పార్టీ తప్పుపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.