Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా బ్యాలట్ పత్రాలు, ఈవీఎంలలో మార్పులు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బ్యాలట్ పేపర్లు, ఈవీఎంలలో పార్టీ గుర్తులకు బదులుగా అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హతలు, ఫొటో ఉంటే బాగుంటుందని, ఆ మేరకు మార్పులు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. అయితే ఆ పిటిషన్‌ను న్యాయస్థానం అంగీకరించలేదు. పిటిషనర్ కోరిన మార్పులు చేయడానికి సాంకేతికంగానే కాకుండా పలు రకాలుగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.