Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిస్బేన్ : టీ20 ప్రపంచకప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్ర్కమించింది. మంగళవారం శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 144 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని
చేరుకుంది. డిసిల్వా 42 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆఫ్ఘన్ బౌలర్లలో రెహ్మాన్‌కు రెండు, రషీద్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ గెలుపుతో గ్రూప్ 1లో నాలుగు పాయింట్లతో శ్రీలంక మూడవ స్థానంలో నిలిచింది. అఫ్ఘన్ మాత్రం ఇంటి బాట పట్టింది.