Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం ఆయన మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసిన కేటీఆర్ తన కాన్వాయ్ ను ఆపారు. కారు దిగి బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం వారిని తన కాన్వాయ్ లోని ఓ కారులో ఎక్కించి హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు.