Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండోర్ : మధ్యప్రదేశ్లో దారుణ ఘటన మంగళవారం వెలుగు చూసింది. నాలుగేండ్ల బాలికపై లైంగికదాడి చేసి చెరుకు తోటలోని పొదల్లో పడేసి వెళ్లిపోయాడో వ్యక్తి. సోమవారం ఖండ్వా జిల్లాలో జస్వాడిలోని తన బంధువుల ఇంటి నుంచి ఓ బాలిక అదృశ్యమైంది. దాంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పొలాల్లోని పొదల్లో అపస్మారక స్థితిలో ఓ బాలిక కనిపించడంతో స్థానికుల సహాయంతో పోలీసులు ఇండోర్‌లోని ఓ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఓ షాపులో పనిచేస్తున్న 25 ఏండ్ల యువకుడిపై అనుమానం వచ్చింది. ఆ వ్యక్తికి బాధిత కుటుంబంతో పరిచయం ఉంది. ఆదివారం రాత్రి అతను వారి ఇంటి నుంచి మంచాన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడని జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. అతన్ని పోలీసులు విచారించగా బాలికను పొలానికి తీసుకెళ్లి లైంగికదాడి చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. నిందితుడు బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి.. పొలానికి తీసుకెళ్లి లైంగికదాడి చేసి, ఆ తర్వాత పొదల్లో పడేసినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.