Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిస్బేన్ : తప్పక గెలవాల్సి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు.. జోస్ బట్లర్ (73), అలెక్స్ హేల్స్ (52) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ
అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40), గ్లెన్ ఫిలిప్స్ (62)
రాణించగా.. వీరిద్దరూ ఔట్ కావడంతో కివీస్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మిగితా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో సామ్ కర్రన్ (2/26), క్రిస్ వోక్స్ (2/33), మార్క్ వుడ్ (1/25), బెన్ స్టోక్స్ (1/10) గణాంకాలు నమోదు చేశారు.