Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలో కొందరు అక్రమంగా ఆయుధాలను కారు తరలిస్తుండగా పోలీసులు ఏకంగా 90 కిలోమీటర్లు వెంబడించి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దుండగులు కారును వదిలి పారిపోయారు.
అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నారని మధ్యప్రదేశ్ పోలీసులకు మంగళవారం సమాచారం అందింది. దాంతో ఇండోర్‌లో ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై హర్యనా రిజిస్టర్డ్ కారును పోలీసులు ఆపేందుకు యత్నించారు. అయితే కారులో ఉన్న నలుగురు దుండగులు వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దాంతో పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఒకచోట దుండగులు పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు. చివరకు ఇండోర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని ఖల్‌ఘాట్‌కు చేరుకున్న దుండగులు అక్కడ బారీకేడ్‌లను ఢీకొట్టి కారును అక్కడే వదిలేసి పారిపోయారు. దాంతో కారులో ఉన్న మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 40 పిస్తోల్‌లు, 36 మ్యాగజీన్‌లు, ఐదు క్యాట్రిడ్జ్‌లు దొరికిన వాటిలో ఉన్నాయి. ఈ ఆయుధాలు విదేశాల్లో తయారయినవని పోలీసులు గుర్తించారు.