Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చిరునవ్వుతో రాష్ట్రం మొత్తాన్ని గెలుచుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే అది పునీత్ రాజ్‌కుమార్ మాత్రమేనని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలో మంగళవారం కన్నడ రాజ్యోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్నను పునీత్ రాజ్‌కుమార్ సతీమణికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమనికి హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎల్లారిక్కు నమస్కారఁ అంటూ కన్నడలో ప్రసంగించారు.
కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక వ్యక్తి తన పెద్దల నుండి కుటుంబ వారసత్వం, ఇంటిపేరును పొందుతాడన్నారు. కానీ వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలని చెప్పారు. అహం, అహంకారం లేకుండా తన వ్యక్తిత్వం, చిరునవ్వుతో రాష్ట్రం మొత్తాన్ని గెలుచుకున్న వారు ఎవరైనా ఉన్నారా..? అంటే అది పునీత్ రాజ్‌కుమార్ మాత్రమేనన్నారు. అందుకే ఆయనను కింగ్ ఆఫ్ స్మైల్ అంటారన్నారు. సూపర్ స్టార్ ఆఫ్ కర్ణాటక, గొప్ప కుమారుడు, గొప్ప భర్త, గొప్ప నటుడు, గొప్ప గాయకుడు, గొప్ప తండ్రి, గొప్ప స్నేహితుడు, అన్నింటికి మించి ఒక గొప్ప వ్యక్తి అంటూ పునీత్ రాజ్ కుమార్ ను కీర్తించారు. ఆయనకు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడం సముచితమని తెలిపారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను వారి కుటుంబంలో ఒకరిగా భావించే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
విధాన సౌధకు విచ్చేసిన సందర్భంగా ఎన్టీఆర్ ను ఆ రాష్ర్ట సీఎం బసవరాజ్ బొమ్మై కన్నడ పేటా, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరయ్యారు.