Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై ఖైదీల భార్యలు సంచలన ఆరోపణలు చేశారు. ములాఖత్ కు వచ్చే ఖైదీల భార్యలపై అతను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వద్ద వారు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ జితేందర్ వద్దకు చేరగా దశరథంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో చింతల దశరథంను జైలు అధీనంలోని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. గతంలో జైల్లోని మహిళా సిబ్బందిపైనా దశరథం లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.