Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో అమరావతి రైతుల మహాపాదయాత్ర త్వరలో తిరిగి పునః ప్రారంభమవుతుందని అమరావతి పరిరక్షణ సమితి వెల్లడించింది. జేఏసీ నేతలు శివారెడ్డి, బాలకోటయ్య తదితరులు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు అనుమతితోనే అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టామన్నారు. సుప్రీంకోర్టులో అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందా, లేదా అని ప్రశ్నించారు. కోర్టు అనుమతితో పాదయాత్ర చేపట్టినా అనేక అడ్డంకులు సృష్టించి, అవమానించారన్నారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమపై సీసాలు వేయించి దాడి చేయించారని చెప్పారు. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అరగంటలోనే పోలీసులు తమ వద్దకు వచ్చి రౌడీల్లా వ్యవహరించారని ఆరోపించారు. ఈ కారణంగానే పాదయాత్రను కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా ఆపామని చెప్పారు. ఒక సమావేశాన్ని నిర్వహించుకుని త్వరలో పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. వాహనాలు పార్కింగ్ చేసిన ప్రదేశంలో రామచంద్రపురం డీఎస్పీ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని, సీసీ కెమెరాల ఫుటేజీ ఉన్న హార్డ్‌డి్‌స్కను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అమరావతి రాజధానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అండగా ఉండాలని కోరారు.