Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీరు ఎంసెట్ రాయలేదా.. రాసినా క్వాలిఫై కాలేదా.. అయితే నో టెన్షన్. అయినా ఇంజినీరింగ్‌లో చేరొచ్చు. ఇంజినీర్ అయ్యే కలను నెరవేర్చుకోవచ్చు. ఇలాంటి అపూర్వ అవకాశం స్పాట్ అడ్మిషన్స్ ద్వారా లభిస్తున్నది. ఎంసెట్‌లో క్వాలిఫై అయినవారు కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందగా, మిగిలిన సీట్లను ఎంసెట్ క్వాలిఫై కానివారికి కేటాయిస్తారు. వీరికి రీయింబర్స్‌మెంట్ వర్తించదు. ఫీజు చెల్లించే స్థోమత ఉంటే బుధ, గురువారాల్లో ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా సీటును పొందవచ్చు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగియడంతో ఈ నెల 3 వరకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది బీటెక్‌లో 63, 899 సీట్లు కౌన్సెలింగ్‌లో నిండాయి. సీట్లు పొందిన వారిలో ఇప్పటివరకు 57,500 మంది విద్యార్థులు మాత్రమే నిర్దేశిత ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌చేశారు. దాంతో 6,399 వరకు సీట్లు మిగిలిపోగా, కౌన్సెలింగ్‌లో భర్తీకానివి మరో 19,421 సీట్లున్నాయి. మొత్తం 25 వేల సీట్లను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీ చేస్తారు.