Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. మణిపూర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఇల.గణేశన్ జన్మదిన వేడుకలు ఈ నెల 3వ తేది నగరంలో జరుగనున్నాయి. ఈ వేడులకు హాజరుకావాలని గవర్నర్ ఆహ్వానం మేరకు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బుధవారం నగరానికి రానున్నారు. తన పర్యటనలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మమతా బెనర్జీ సమావేశం కానున్నారని సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది.