Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్: ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్ సైన్యం ఓ బాలిస్టిక్ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. అమెరికా-దక్షిణకొరియా సైన్యాలు భారీస్థాయిలో సంయుక్త గగణతల విన్యాసాలు నిర్వహించిన నేపథ్యంలో హెచ్చరికగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. తూర్పు సముద్రం వైపు ఉత్తర కొరియాకు చెందిన ఓ క్షిపణిని దూసుకెళ్లిందని సియోల్ సైన్యం పేర్కొన్నది. తూర్పు సముద్రాన్ని జపాన్ సముద్రం అనికూడా పిలుస్తారు. కాగా, గత వారం రోజుల్లో జపాన్‌వైపు క్షిపణులను ప్రయోగించడం ఇది రెండోసారి. గత నెల 28న ఇదేతరహాలో తూర్పు సముద్రంవైపు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పరీక్షించింది.
కాగా, గత నెల రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడం ఇది ఎనిమిదోసారి. దాదాపు ఐదేళ్లలో తొలిసారిగా అక్టోబరు 4వ తేదీన ఉత్తర కొరియా జపాన్ మీదుగా మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించిన రెండు రోజుల తర్వాత, బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించబడింది.