Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరీంగంజ్: అసోంలో పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. మత్తు మందును సబ్బు పెట్టెల్లో రహస్యంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హెరాయిన్‌ను తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారంతో కరీంగంజ్‌లోని అశీమ్‌గంగ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అశీమ్‌గంజ్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ వ్యాన్‌ను పోలీసులు ఆపారు. దీంతో డ్రైవర్ వ్యాన్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు.
దీంతో అందులో తనిఖీ చేయగా సబ్బు పెట్టెల్లో రహస్యంగా తరలిస్తున్న 676 గ్రాముల హెరాయిన్ గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న సబ్బుల పెట్టెలతో కూడిన 52 కేసులను పోలీసులు సీజ్ చేశారు. బహిరంగా మార్కెట్‌లో దాని విలువ రూ.5 కోట్లు ఉంటుందని చెప్పారు. ఆ వాహనం మిజోరం నుంచి పతార్‌కండీకి వెళ్తున్నదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.