Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారు అయింది. దేశ ప్రధాని మోడీ నవంబర్ 11న విశాఖలో పర్యటించనున్నారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన, కేంద్ర ప్రభుత్వ శాఖల పరంగా జరిగే మరికొన్ని కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నెల 11న ప్రధాని మోడీ విశాఖ రానున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలకనున్నారు గవర్నర్ హరిచందన్, సీఎం జగన్. ఈ నెల 12 ఏయూలో జరిగే బహిరంగ సభలో పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోడీ.
అయితే నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. విపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ప్రధాని విశాఖ టూర్ రోజున నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నాయి.