Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గచ్చిబౌలిలోని టీ - హబ్‌ను వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 40 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులు టీ - హబ్‌ను, అందులోని వీ-హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), రీసెర్చ్, ఇన్నోవేషన్స్ సర్కిల్ ఆఫ్ తెలంగాణ(రిచ్), ఇమేజ్ తదితర కేంద్రాలను సందర్శించారు. అక్కడ రూపొందించిన పలు ఆవిష్కరణలను ఐఏఎస్ అధికారులు అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఈవో సుజయ్ కారంపురి టీ-హబ్ కార్యకలాపాలను వారికి వివరించారు. ఇన్నోవేషన్స్ వర్క్ షాప్‌లో సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్టార్ట్‌పల సంస్కృతి పెరుగుతోందని అన్నారు.