Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడిలైడ్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు 118 పరుగుల టార్గెట్‌ను విసిరింది జింబాబ్వే. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వేను నెదర్లాండ్స్ బౌలర్లు సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఆరంభం నుంచి జింబాబ్వే క్రమంగా వికెట్లను కోల్పోయింది. ఇక ఆరు ఓవర్ల పవర్‌ప్లేలో కేవలం 20 రన్స్ మాత్రమే చేసింది జింబాబ్వే. ఆ పవర్‌ప్లేలో మూడు వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో రాజా అత్యధికంగా 40 రన్స్ చేశాడు. సీన్ విలియమ్స్ 28 రన్స్ చేశాడు. మిగితా బ్యాటర్లు ఎవ్వరూ రెండు అంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో పాల్ వాల్ మీకరన్ మూడు వికెట్లు తీసుకోగా, బ్రాండన్ గ్లోవర్, లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడ్‌లు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు.