Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. విద్యా ర్ది ఆత్మహత్యకు పయత్నించాడు. వివరాల ప్రకారం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న వంశీ పటేల్ అనే విద్యార్ది పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ తరుణంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు ఎనభై శాతానికి పైగా శరీరం కాలిపోతున్న క్రమంలో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత జరిగినా విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణాలను అడిగితే దాటవేసే ప్రయత్నం చేస్తోంది కాలేజీ సిబ్బంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలవాల్సి ఉంది.