Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలోని లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 2) నుంచి ఈ నెల 12 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ అప్‌లోడింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 14 నుంచి 16 వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 17న రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఎంపికైనవారు 18, 19 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
నవంబరు 20న వెబ్‌ఆప్షన్లలో సవరణకు అవకాశం కల్పించారు. అనంతరం వారికి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను (నవంబర్ 22న) కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు ఈనెల 23 నుంచి 26 వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్డ్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 28 నుంచి తరగతులు ప్రారంభవుతాయి. లా కోర్సుల్లో ప్రవేశాలకోసం జూలై 21, 22 తేదీలో లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించగా, ఆగస్టు 17న ఫలితాలను ప్రకటించారు. మూడేండ్ల లా కోర్సుకు 15,031 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఐదేండ్ల కోర్సుకు 4,256 మంది అర్హత సాధించారు. అలాగే పీజీఎల్‌సెట్‌లో 2,375 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో 26 లా కాలేజీలు ఉన్నాయి.