Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మొదటి సంవత్సరం చదువుతున్న 25 మంది విద్యార్థులను తమ సీనియర్స్ 34 మంది కలిసి ర్యాగింగ్ చేశారు. దీనిపై కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ చర్యలు తీసుకున్నారు. 34 మంది సీనియర్ విద్యార్థులను సస్పెన్షన్ చేశారు. 25 మంది విద్యార్థులను రెండు వారాల పాటు కళాశాల, హాస్టల్ నుంచి బహిష్కరించగా, మరో 9 మంది విద్యార్థులను రెండు వారాల పాటు హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాటు కళాశాల బస్సులో వారు ప్రయాణించరాదని ఆదేశించారు. ఈ సంఘటన దీపావళి పండుగకు ముందు జరిగింది. బ్యాచ్‌లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(బీవీఎస్సీ) మొదటి సంవత్సరం చదువుతున్న 25 మంది విద్యార్థులను సీనియర్ విద్యార్థులు హాస్టల్ పైకి పిలిపించి అర్థ నగ్నంగా డ్యాన్స్ చేయించినట్లు, కొందరు విద్యార్థులను గోడ కుర్చీ వేయించినట్లు తెలిసింది. బస్సులో మోకాళ్లపై నడిపించారని వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసింది వాస్తవమేనని డీన్ డాక్టర్ రఘునందన్ తెలిపారు.