Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ఈ రోజు బీజేపీకి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఓటర్లకు తులం బంగారం అంటూ జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తమకు బంగారం ఇవ్వకుండా మూడు వేలు మాత్రమే ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఓటర్లు నిలదీశారు. జిల్లాలోని మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓటుకు తులం బంగారం ఇస్తామని చెప్పి రూ.3 వేలు మాత్రమే ఇచ్చారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తులం బంగారం ఇవ్వకుంటే ఓటు వేయబోమని హెచ్చరించారు. ఓటర్లు ఊరు ఊరంతా ఏకమై నేతలపై తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది.