Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడకు చెందిన అరుద్ర
అనే మహిళ చేతిపై బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వీల్‌చైర్‌లో కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తెను తీసుకొచ్చిన తల్లి ఆరుద్ర సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. అక్కడ నిర్వహించే స్పందనలో సీఎంవో అధికారులను కలిసి వచ్చాక ఈ అఘాత్యానికి పాల్పడింది. అచేతనంగా పడి ఉన్న మహిళను గమనించిన సీఎంవో పోలీసులు హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు మాట్లాడుతూ తన కూతురు దివ్యాంగురాలి చికిత్స కోసం తమ భూమిని అమ్ముకోనియకుండా ఏపీ మంత్రి దాడిశెట్టి రాజ గన్‌మెన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ విషయమై గతంలో కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సీఎం కార్యాలయం వరకు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎంను అధికారులు కలవనీయలేదని, తనకు న్యాయం జరగదనే బాధతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఆమె వెల్లడించింది.