Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తన పుట్టిన రోజు నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అభిమానులకు కానుక ఇచ్చాడు. తన తదుపరి చిత్రం 'పఠాన్' టీజర్ ను చిత్రం బృందం ఈ ఉదయం విడుదల చేసింది. కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న షారుఖ్ 'పఠాన్'పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ చూస్తుంటే షారుఖ్ ఖాతాలో మంచి విజయం చేరుతుందనిపిస్తోంది. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో షారుఖ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. విలన్ పాత్రలో నటిస్తున్న జాన్ అబ్రహం, షారుఖ్ మధ్య భారీ ఫైట్లు చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. హీరోయిన్ దీపిక పదుకొణే తన అందాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించింది. ఈ చిత్రం వచ్చే జనవరి 25న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్ లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.