Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలు పంట కోత పనుల్లో ఉండగా, వారిపై విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో ఈ ఘటన జరిగింది. వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగిందని దర్గాహొన్నూరు మాజీ సర్పంచ్ ముక్కన్న వెల్లడించారు. ఘటన స్థలం మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. తమ వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది.