Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తిచేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన ట్రేడ్ మార్క్ నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇటీవల ట్విట్టర్ లో పెద్ద తలకాయలను సాగనంపిన మస్క్.. ట్విట్టర్ విధివిధానాలను కూడా మార్చివేస్తున్నారు. ట్విట్టర్ లో సెలబ్రిటీ ఖాతాలకు కేటాయించే బ్లూటిక్ ఫీజును పెంచుతున్నట్టు మస్క్ ప్రకటించారు. ఇకపై బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు (రూ.661) చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఈ ధర ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండొచ్చని పేర్కొన్నారు. అంతేకాదు, దీనిపై వస్తున్న స్పందనలకు బదులిచ్చిన మస్క్... 'ఫిర్యాదులు చేసేవాళ్లందరికి ఒకటే చెబుతున్నా... దయచేసి మీరు ఫిర్యాదు చేస్తూనే ఉండండి... కానీ దీని ఖరీదు మాత్రం 8 డాలర్లు' అంటూ బ్లూ టిక్ ఫీజు పెంపుపై తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కాగా, ఇప్పటివరకు బ్లూ టిక్ ఫీజు నెలకు రూ.410గా ఉంది.