Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై కేసు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. మంత్రి కేటీఆర్ మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని అరవింద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆకుల శ్రీవాణి పై కేసు నమోదు చేశారు. ఈ నెల నాలుగవ తేదీన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే తనపై నమోదైన పోలీసు కేసు పై బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి స్పందించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు శ్రీవాణి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు బిజెపి కార్పొరేటర్ శ్రీవాణి. తనకి న్యాయం జరిగే వరకూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.