Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి నుండి సూర్యాపేట ప్రధాన రహదారి గున్నేపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గున్నేపల్లి ఎక్స్ రోడ్డులో ఓ డీసీఎం బైకు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది.