Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్‌లో అత్యంత ఘోరమైన మోర్బీ తీగల వంతెన ప్రమాదం జరిగితే, అనేక మంది చనిపోతే ఈ ఘటనపై కనీస దర్యాప్తు కూడా జరగదా? అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిలదీశారు. పలు విషయాలపై కేంద్రం సిబిఐ, ఇడి దర్యాప్తు అంటుంది కదా. మరి ఈ ఘటనపై వీటి జాడ ఏదీ ? అని ప్రశ్నించారు. దాదాపు 150 మంది వరకూ ఈ దుర్ఘటనలో మృతి చెందారు. అదీ గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా కోట్లాది రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్న దశలోనే జనం కదలాడే వంతెన కూలింది. పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాను పెద్దగా వ్యాఖ్యానించదల్చుకోలేదని ఇతరులలాగా దీనిని రాజకీయం చేయబోనని, అయితే మనుష్యుల ప్రాణాలను బలిగొన్న ఘటనకు జవాబుదారిఎవరవుతారు? దీనికి సమాధానం కావాలని వ్యాఖ్యానించారు. ఇటీవలే మోర్బీలోని తీగల వంతెనపై లెక్కకు మించిన జనం చేరడం, వంతెన కుప్పకూలడం ఇప్పటివరకూ ఎందరు దుర్మరణం చెందారు. నదిలో ఎన్ని మృతదేహాలు ఉన్నాయి? అనేది నిర్థారణ కాని విషయంగా మారింది. ఇంత పెద్ద భారీ ప్రమాదం విషాదంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జుడిషియల్ దర్యాప్తు చేపట్టాల్సి ఉందని మమత బెనర్జీడిమాండ్ చేశారు.