Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దీపావళి పండుగ నుంచి మెదక్ జిల్ల చేగుండ మండలం పెద్దశివునూరు గ్రామంలో విరేచనాలతో సుమారు 80 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడియారం పోచవ్వ(50) బుధవారం మృతి చెందింది. వైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స చేసి ఇళ్లలోకి పంపించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న పలువురిని చికిత్స కోసం తూప్రాన్, సిద్దిపేట, హైదరాబాద్‌లలోని ఆస్పత్రులకు తరలించగా, చికిత్స అనంతరం కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు. వడియారం పోచవ్వ డయేరియాతో మృతి చెందగా, పోచవ్వ మృతితో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఆరుగురు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.