Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్ పోలింగ్‌ను నిర్వహించారు. చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అయితే, ఎన్నికల్లో మూడు బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్నికలకు భారీ భద్రతను కల్పించారు. 5,500 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరించారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించగా.. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ చేయడంతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 35 శాతం ఈవీఎంలను అదనంగా సిద్ధం ఉంచగా.. సాంకేతిక లోపాలు తలెత్తితే.. సరిచేయడానికి 28 మంది ఇంజినీర్లను నియమించారు. నియోజకవర్గంలో మొత్తం 199 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.