Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్ – అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు – కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతుల వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.