Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికారాబాద్: జిల్లాలోని ధారూర్ మండలం కేరెళ్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలు ఉన్న ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతులు వడితె రవి, రాథోడ్ , జమీల్‌లుగా గుర్తించారు. మృతులు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మధనాంతపూర్ తండా, రేగొండిలకు చెందిన వారుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.