Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను ఖండిస్తూ పెదగదిలి అంబేద్కర్ జంక్షన్‌లో గురువారం ఉదయం టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులను నొక్కలేరు అంటూ నినాదాలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తగ్గబోమని నాయకులు హెచ్చరించారు. అయ్యన్న పాత్రుడిని, అతని కుమారుడు రాజేష్‌ను బేషరతుగా విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.