Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ (గురువారం) మధ్యాహ్నం నంద్యాల జిల్లా అవుకు వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అంత్యక్రియలకు హాజరై, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కాగా, నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.