Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కెఎపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో కామెడి వస్తువుగా తయారయ్యాడు. జనం పాల్ చేష్టలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీడీయాను అట్రాక్ట్ చేయడానికి పాల్ ఏదో ఒక చిలిపి పని చేస్తుంటాడు. ఆయన మాట్లాడితే ఫుల్ కామెడీ. ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. పాల్ తన కారులో ప్రతి పోలింగ్ బూత్‌ను విజిట్ చేస్తున్నారు. అయితే అందిరిలా ఉంటే ఆయన పాల్ కాడు కదా… అందుకే పోలింగ్ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు. ఎందుకలా పరుగెడుతున్నారని మీడియా అడిగితే… టైం లేదు.. అన్ని పోలింగ్ బూతులను కవర్ చేయాలి కదా. అందుకే సాయంత్రం వరకు ఇలా పరుగెడుతూనే ఉంటా.. అంటున్నాడు. పాల్ పరుగులు తీస్తున్న వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి.