Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గురువారం మరో కీలక పదవిని భర్తీ చేసింది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, కథా రచయిత పోసాని కృష్ణ మురళిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం హాస్య నటుడు అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. అలీ నియమకం జరిగిన రోజుల వ్యవధిలోనే పోసానికి కూడా కీలక పదవి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలీ మాదిరే పోసాని కూడా 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. వైసీపీ వాదనతో పాటు సీఎం జగన్ వాదనలను బలంగా సమర్ధిస్తూ వస్తున్న పోసానికి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి దక్కడం గమనార్హం.