Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తనయుడు రాజేష్‌ను పోలీసులు సింహాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సింహాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 20 నిమిషాల పాటు ఉన్నారు. ఇరువురికి ప్రభుత్వ వైద్య అధికారి భాస్కరరావు వైద్య పరీక్షలు చేశారు. రాత్రి నుంచి తీవ్ర ఒత్తిడికు లోనవుతున్నటువంటి అయ్యన్నపాత్రుడు హైపర్ టెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. అయ్యన్నపాత్రుడికి బిపి లెవెల్స్ 100/70 గా ఉండగా... షుగర్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.