Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆరంభంలో పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వాటిని సరిచేశారు. ఈ క్రమంలో గంట గంటకూ పోలింగ్ శాతం పెరుగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా క్యూలైన్లో ఓటర్లు భారీగా ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎక్కువగా మహిళలు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.