Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇఫ్తికర్ అహ్మద్(51), షాదాబ్ ఖాన్(52) హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో.. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. ఆరో వికెట్‌కు ఇఫ్తికర్, షాదాబ్‌లు కీలకమైన 82 రన్స్ జోడించారు. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ ఆరంభంలో వికెట్లను కోల్పోయింది. బాబర్, రిజ్వాన్‌లు ఈ మ్యాచ్‌లోనూ రాణించలేదు. స్వల్ప స్కోర్లకే వాళ్లు ఔటయ్యారు. పాకిస్థాన్ పవర్‌ప్లేలో మూడు వికెట్లకు 42 రన్స్ మాత్రమే చేసింది. అయితే మిడిల్ ఆర్డర్‌లో ఇఫ్తికర్, షాదాబ్‌లు ధీటుగా బ్యాటింగ్ చేశారు. సౌతాఫ్రికా పేస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఇఫ్తికర్ 51, షాదాబ్ 52 రన్స్ చేసి ఔటయ్యారు. పాక్ బ్యాటర్ నవాజ్ 28 రన్స్ చేశాడు. సఫారీ బౌలర్ నోర్జా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.