Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ దుబ్బాక రూరల్
గత మూడు సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మానాభునిపల్లి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కుకునూరి సత్తయ్య -లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నవీన్ 22 గత మూడేళ్ళుగా బ్లెడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.కుటుంబం పేదరికంలో ఉండటం వల్ల 2 ఏళ్ల క్రితం గ్రామస్తులు, యువత, దాతల సహాయకారంతో బ్లేడ్ మార్పిడి ,వైద్యం చేయించారు.అప్పటి నుండి ప్రతి మూడు, నెలలకోసారి హైదరాబాద్ లో చెకప్ చేయించుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం నుండి నవీన్ కోలుకుని ఊళ్ళో అందరితో కలిసి మెలసి తిరుగుతూ అమ్మ నాన్నలకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. గత 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా ఇటీవల చికిత్స పొందుతూ మృతిచెందారు.దింతో ఆ పేద కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నవీన్ మరణంతో స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో వైపు రేక్కాడితే డొక్కాడని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు,మృతుడి బంధువులు కోరుతున్నారు