Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 వరల్డ్‌కప్ సూపర్-12లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 33 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో పాక్ జట్టు సెమీస్‌పై ఆశలు నిలుపుకున్నది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాక్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. అయితే వర్షం కారణంగా సౌతాఫ్రికా టార్గెట్‌ను 14 ఓవర్లలో 142 రన్స్‌కు కుదించారు. ఆ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 రన్స్ మాత్రమే చేసింది. దీంతో పాక్ 33 రన్స్ తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజా విక్టరీతో గ్రూప్ 2లో నాలుగు పాయింట్లతో పాక్ మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇండియా, సౌతాఫ్రికాలు ఫస్ట్ రెండు స్థానాల్లో ఉన్నాయి.