Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు మారం శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ( పీహెచ్‌డీ ) అందుకున్నారు. 50 ఏండ్లలో విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల చారిత్రాత్మక అభివృద్ధి అనే అంశంపై సమర్పించిన థీసీస్‌కు మారం శ్రీనివాస్‌కు పీహెచ్‌డీ లభించింది. ఓయూలోని ప్రాచీన భారత దేశ చరిత్ర సంస్కృతి, పురాతత్వ శాస్త్రం శాఖలో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన ఆచార్య కె. వెంకటాచలం పర్యవేక్షణలో ఆయన ఈ సిద్ధాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించారు. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పెనిమిళ్ల గ్రామానికి చెందిన మారం శ్రీనివాస్.. ఓయూ నుంచి ఎంఏ, ఎల్ఎల్‌ఎం పట్టా, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంసీజే, ఎంఏ (టూరిజం మేనేజ్‌మెంట్ పట్టాలు సాధించారు. గత పాతికేండ్లుగా పాత్రికేయునిగా పనిచేస్తున్న శ్రీనివాస్.. అనేక దేశాల్లో పర్యటించి ఆయా దేశాల చరిత్ర, సంస్కృతి ఆచార వ్యవహారాలపై వ్యాసాలు, కథనాలు రాశారు. మలేసియా దేశంలోని పర్యాటక రంగానికి సంబంధించి రాసిన వ్యాసానికి అక్కడి ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి శ్రీనివాస్ పీహెచ్‌డీ అందుకోవడం పట్ల పాత్రికేయులు, విద్యారంగ నిపుణులు అభినందనలు తెలిపారు.