Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయులు గొవర్ధన సుందర వరదాచారి(92) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం రంగం వృద్ధికి కృషి చేశారు. వరదాచారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదాచారి1956 ఒక తెలుగు దిన పత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరి తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. 1961లో ఆంధ్ర భూమి దిన పత్రికలో న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టి 22 సంవత్సరాలు పనిచేశారు. ప్రముఖ దిన పత్రిక ఈనాడులో అసిస్టెంట్ ఎడిటర్‌గా 1983లో బాధ్యతలు చేపట్టారు. తెలుగు విశ్వావిద్యాలయంతో పాటు అనేక యూనివర్సిటీలలో ఆయన జర్నలిజం బోధించారు. అన్ని ప్రముఖ దిన పత్రికల జర్నలిజం కళాశాలలో అయన బోధించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులలో పత్రికల భాష అంశంపై ఆయన బోధించే వారు.
సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం రంగానికి సేవలందించారని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.