Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటరు స్లిప్పులు ఇచ్చామని తెలిపారు. పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. రాత్రి 8, 9 వరకు పోలింగ్ కొనసాగవచ్చని తెలిపారు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల బయట స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపారు.